Page Loader
SSMB29: రాజమౌళి 'సీజ్‌ ద లయన్‌' వీడియోతో SSMB29 షూటింగ్‌ ప్రారంభం
రాజమౌళి 'సీజ్‌ ద లయన్‌' వీడియోతో SSMB29 షూటింగ్‌ ప్రారంభం

SSMB29: రాజమౌళి 'సీజ్‌ ద లయన్‌' వీడియోతో SSMB29 షూటింగ్‌ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక యాక్షన్‌-అడ్వెంచర్‌ మూవీపై సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రాజమౌళి ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు, ఇందులో సింహాన్ని లాక్‌ చేసినట్లు సూచిస్తూ, పాస్‌పోర్ట్‌ చూపించి ఫొటోకు పోజ్‌ ఇచ్చారు. ఈ వీడియోతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి వీడియోకు 'క్యాప్చర్‌' అనే క్యాప్షన్‌ ఇచ్చారు, ఇది అభిమానులను ఊర్రూతలూగించింది. దీనికి మహేశ్‌బాబు తన 'పోకిరి' డైలాగ్‌తో స్పందించి 'ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను' అని కామెంట్‌ చేశారు.

Details

గరుడ అనే టైటిల్ పరిశీలన

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కూడా ఈ వీడియోపై స్పందిస్తూ, 'ఫైనల్లీ' అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్‌ చేశారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా నటించనున్నట్లు గాసిప్స్‌ ముందునుంచే ఉన్నాయి. ఇటీవల ఆమె లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్‌ చేరుకోవడం, ఇప్పుడు రాజమౌళి వీడియోపై స్పందించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇక మహేశ్‌ కోసం ఈ సినిమా టీమ్‌ ఎనిమిది విభిన్న లుక్స్‌ను రెడీ చేసినట్లు టాక్‌. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ కథలో విదేశీ నటులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ చిత్రానికి 'గరుడ' అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి.