Loading...
KBC: కేబీసీ-18కు రంగం సిద్ధం.. 'ఇక అసలైన పరీక్ష మొదలు' అంటున్న అమితాబ్ బచ్చన్
కేబీసీ-18కు రంగం సిద్ధం.. 'ఇక అసలైన పరీక్ష మొదలు' అంటున్న అమితాబ్ బచ్చన్

KBC: కేబీసీ-18కు రంగం సిద్ధం.. 'ఇక అసలైన పరీక్ష మొదలు' అంటున్న అమితాబ్ బచ్చన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ 'షెహెన్‌షా' అమితాబ్ బచ్చన్ మరోసారి తన హోస్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)' 18వ సీజన్‌ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా తన వ్యక్తిగత బ్లాగ్‌ ద్వారా వెల్లడించారు. ముందుగా గురు పౌర్ణమి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ అమితాబ్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేబీసీ కొత్త సీజన్‌కు సంబంధించిన తాజా వివరాలను పంచుకున్నారు. షోకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, ఇక అసలు ప్రయాణం ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. ఇక అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది.

వివరాలు

ఆగస్టు 10 నుంచి ప్రసారం

ఫైనల్ మాక్‌లు పూర్తయ్యాయి. ఇక ప్రొడక్షన్‌, ప్రేక్షకులదే బాధ్యత అని పేర్కొంటూ, సెట్స్‌లో తీసిన కొన్ని ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

అలాగే ఈసారి షో కోసం సిద్ధం చేసిన కొత్త ట్యాగ్‌లైన్‌ను కూడా ఆయన వెల్లడించారు.

ఈసారి మా ప్రోమోలో చెప్పినట్లుగా.. కాస్త గట్టిగా ఆలోచించాల్సిందే (జరా సోచ్‌నా పడేగా) అంటూ కొత్త సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచారు.

ఆగస్టు 1 నుంచి 'కౌన్ బనేగా కరోడ్‌పతి-18' చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఆగస్టు 10 నుంచి ఈ కార్యక్రమం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారం కానుంది.

వివరాలు

అత్యంత విజయవంతమైన రియాలిటీ షోలలో ఒకటిగా గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన 'హు వాంట్స్ టు బీ ఏ మిలియనీర్?' కార్యక్రమానికి అధికారిక హిందీ అనుసరణే 'కౌన్ బనేగా కరోడ్‌పతి'.

ఈ షోకు మూడో సీజన్‌లో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, మిగిలిన అన్ని సీజన్లకు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు.

తన హుందాతనమైన వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సంభాషణలతో కేబీసీని భారత టెలివిజన్‌లో అత్యంత విజయవంతమైన రియాలిటీ షోలలో ఒకటిగా నిలిపారు.

ADVERTISEMENT