Loading...
Bigg Boss 10: బిగ్‌బాస్‌ 10లోకి స్టార్‌ క్రికెటర్‌.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చే!
బిగ్‌బాస్‌ 10లోకి స్టార్‌ క్రికెటర్‌.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చే!

Bigg Boss 10: బిగ్‌బాస్‌ 10లోకి స్టార్‌ క్రికెటర్‌.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్‌ బాస్‌.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ, భారీగా దృష్టిని ఆకర్షించిన ప్రముఖ రియాలిటీ షో. ఈ షో తొలిసారిగా 2006లో హిందీలో ప్రారంభమైంది. అమెరికాలో ప్రసారమైన 'బిగ్ బ్రదర్‌' అనే రియాలిటీ షోకు అనుసరణగా భారత్‌లో 'బిగ్‌బాస్‌' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో ఇది ఒకటిగా నిలిచింది. తెలుగులో ఇప్పటికే బిగ్‌బాస్‌ తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్‌ 10 ప్రారంభం కానుంది. ఇప్పటికే 'అగ్నిపరీక్ష' కార్యక్రమం ద్వారా సామాన్యుల ఎంపిక జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలోనూ బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు మంచి స్పందన లభిస్తోంది. తమిళంలో ఈ షో 2017లో ప్రారంభమై ఇప్పటివరకు తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది.

వివరాలు

కంటెస్టెంట్లుగా సినీ ప్రముఖులు

తాజాగా 2026లో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌ 10ను కొత్త పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో సీరియల్‌ నటులు, సామాన్యులు, సినీ ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొంటుంటారు.

ఈసారి కూడా పలువురు సీరియల్‌ నటులు కంటెస్టెంట్లుగా బరిలోకి దిగనున్నారని ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో ఓ ప్రముఖ క్రికెటర్‌ కూడా ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నారనే సమాచారం వైరల్‌గా మారింది.

వివరాలు

మురళీ విజయ్‌ ఎంట్రీ ఇస్తారా?

బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌ 10 2026 సెప్టెంబర్‌ 6న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. పలువురు సీరియల్‌ నటులు కంటెస్టెంట్లుగా పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ క్రికెటర్‌ మురళీ విజయ్‌ పేరు వినిపిస్తోంది.

ఆయన బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొననున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

దీంతో మురళీ విజయ్‌ నిజంగానే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెడతారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. అయినప్పటికీ ఆయన పేరు మాత్రం సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

సినిమాల్లోనూ నటించిన క్రికెటర్

క్రికెటర్‌ మురళీ విజయ్‌ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించారు. 2023లో ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 10లో కంటెస్టెంట్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రచారం షోపై అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది. మురళీ విజయ్‌ బిగ్‌బాస్‌లోకి వస్తారనే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరోవైపు తెలుగులోనూ పలువురు యంగ్‌ హీరోహీరోయిన్లు బిగ్‌బాస్‌ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT