
Kalki 2898 AD: పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రంలో మరో ప్రపంచాన్ని చూపించనున్న నాగ్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD విడుదలకు సిద్ధంగా వుంది.
ఈ భారీ బడ్జెట్ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ADలో దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించనుంది.
నిన్న, ప్రేక్షకుల అంచనాలను మించి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కల్కికి సంబంధించిన విజువల్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేనంత గొప్పగా కనిపిస్తాయి.
వివరాలు
IMAX వెర్షన్ తో వచ్చే రీ సౌండ్ చెవులు భరిస్తాయా
ఓవర్సీస్ టిక్కెట్ విక్రయాలు అప్పడే మొదలయ్యాయి.. కల్కి 2898 AD ..IMAX వెర్షన్ థియేటర్‌లలో విడుదల చేయనున్నారు.
ఈరోజు,బృందం అద్భుతమైన IMAX పోస్టర్‌ను విడుదల చేసింది. తద్వారా చిత్రం IMAX వెర్షన్‌ను మళ్లీ ఖరారు చేశారు.
IMAXలో కల్కి 2898 AD వైభవాన్ని చూసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మరెక్కడా లేని సినిమా అనుభవం.
ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, బ్రహ్మానందం, కీర్తి సురేష్(బుజ్జి గాత్రదానం)కీలక పాత్రల్లో నటించారు.
ఈ నటీనటులు ప్రతి ఒక్కరు తమ ప్రత్యేక ఆకర్షణ,నైపుణ్యాన్నితెరపై ప్రదర్శిస్తారు.
వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
పాన్-ఇండియన్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 𝐭𝐡𝐞 𝐧𝐞𝐰 𝐰𝐨𝐫𝐥𝐝 𝐢𝐧 𝐈𝐌𝐀𝐗 💥#Kalki2898ADTrailer out now - https://t.co/McNEh16Nv5#Kalki2898AD @IMAX@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/jfTZeJNxJP
— Kalki 2898 AD (@Kalki2898AD) June 11, 2024