
Samantha: ఇష్టమైన జీవితం గడపడమే సక్సెస్..: సమంత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటి సమంత ఇటీవల సిడ్నీలో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో ఆమె పాల్గొని, తన కెరీర్, విజయాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆసక్తికరంగా మాట్లాడారు.
ఎన్నో అడ్డంకులను దాటుకుని కెరీర్‌లో ఎదిగిన అనుభవాలను పంచుకున్నారు.
సక్సెస్ అంటే విజయాలు సాధించడం మాత్రమే కాదు, సామాజిక పరిమితుల నుంచి విముక్తి పొందడమని సమంత వ్యాఖ్యానించారు.
తన దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం. విజయవంతమయ్యానని ఇతరులు చెప్పేంత వరకు వేచి ఉండనని, మనకు నచ్చినట్లు జీవించడమేనని చెప్పారు.
మన అభిరుచులకు తగ్గట్టుగా పనులు చేయడమే నిజమైన విజయమన్నారు.
Details
యాక్షన్ సిరీస్ మూవీ కోసం శిక్షణ తీసుకుంటున్న సమంత
మహిళలను కట్టుబాట్లకు పరిమితం చేయడం కాదని, వారి ప్రతిభను స్వేచ్ఛగా వెలుగులోకి తేవడమే నిజమైన సక్సెస్ అని సమంత స్పష్టం చేశారు.
కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు, మంచి కథలను ప్రేక్షకులకు అందించేందుకు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు.
అనంతరం తన విద్యా జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో సిడ్నీ యూనివర్సిటీలో చేరాలని కలలు కన్నానని, కానీ అనుకోకుండా సినీరంగంలోకి వచ్చానని చెప్పారు.
సినిమాల విషయానికి వస్తే, సమంత 'రక్త్ బ్రహ్మాండ్' అనే యాక్షన్ సిరీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు.
అలాగే, ఇటీవల 'మా ఇంటి బంగారం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.