LOADING...
Chiranjeevi: 'మీ వల్లే అలాంటి ఘటనలు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
'మీ వల్లే అలాంటి ఘటనలు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi: 'మీ వల్లే అలాంటి ఘటనలు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో అసలు క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఇందుకు తన కూతురు సుష్మితనే ప్రత్యక్ష సాక్ష్యమని చిరంజీవి పేర్కొన్నారు. సినీ పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ప్రధాన ఆరోపణగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై చిరంజీవి స్పందించారు. 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేవి వాస్తవంగా లేవని, వ్యక్తిగత ప్రవర్తనపైనే అన్నీ ఆధారపడి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

Details

క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలు

'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో హైదరాబాద్‌లో ఆదివారం (జనవరి 25) రాత్రి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశంపై స్పష్టంగా మాట్లాడారు. తన కూతురు సుష్మితను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇక్కడ కష్టపడితే ఎవరైనా ఎదగగలరని అన్నారు. ఇండస్ట్రీలో ఆడైనా, మగైనా రాణించాలంటే ఎంకరేజ్ చేయాల్సిందే. ఇక్కడ ఎవరికైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయంటే, అది ఎక్కువగా వారి తప్పిదం వల్లే అని నేను నమ్ముతాను. నువ్వు స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఉంటే ఎవడూ నీ మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించడు.

Details

ఇండస్ట్రీ అద్దంలాంటిది

క్యాస్టింగ్ కౌచ్ లాంటివేమీ ఉండవు. అన్నీ నీ ప్రవర్తనను బట్టే ఉంటాయి. నీ అభద్రతాభావాన్ని చూసే కొందరు అలా అనుకోవచ్చు. కానీ నువ్వు ప్రొఫెషనల్‌గా ఉంటే అవతలి వాళ్లు కూడా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అద్దంలాంటిది. నువ్వు ఏమిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ఇండస్ట్రీలోకి రావాలంటే కృతనిశ్చయంతో, హార్డ్ వర్క్‌పై నమ్మకంతో రావాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ. ఇక్కడ మీరు తప్పకుండా రాణిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నా కూతురు సుష్మిత. అలాగే దత్తుగారి పిల్లలు, స్వప్న దత్ లాంటి వాళ్లు కూడా ఉదాహరణలేనని చిరంజీవి వ్యాఖ్యానించారు.

Advertisement

Details

'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ జోరు

చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలై 14 రోజులు పూర్తైనప్పటికీ వసూళ్ల వేగం ఏమాత్రం తగ్గలేదు. సినిమా ఇప్పటికే రూ.400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. రెండో ఆదివారం కూడా బుక్‌మైషోలో లక్షా 21 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

Advertisement