LOADING...
Jatadhara Trailer: సుధీర్ బాబు 'జటాధర' నుంచి కొత్త‌ ట్రైల‌ర్

Jatadhara Trailer: సుధీర్ బాబు 'జటాధర' నుంచి కొత్త‌ ట్రైల‌ర్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు సుధీర్‌ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి 'జటాధర' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కలిసి దర్శకత్వం వహిస్తుండగా, కథను వెంకట్ కళ్యాణ్ అందిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న బైలింగ్వల్‌ సినిమా ఇది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటిగా ప్రసిద్ధి పొందిన సోనాక్షి సిన్హా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సంబంధించిన అన్ని పనులను వేగంగా ముగించుకుంటోంది. ఇప్పటికే ఒక టీజర్, ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్ర బృందం, తాజాగా రిస్లీజ్ ట్రైలర్ను కూడా విడుదల చేసింది.

వివరాలు 

ప్రధాన పాత్రల్లో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్  

మైథాలజికల్ టచ్‌తో కూడిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ట్రైలర్ ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జీ స్టూడియో సమర్పణలో, ఉమేశ్‌ కె.ఆర్‌. భన్సాల్ మరియు ప్రేరణ అరోరా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్