LOADING...
Sudheer Babu : 'జటాధర' టీజర్‌ విడుదల తేదీ ఫిక్స్.. 
'జటాధర' టీజర్‌ విడుదల తేదీ ఫిక్స్..

Sudheer Babu : 'జటాధర' టీజర్‌ విడుదల తేదీ ఫిక్స్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జటాధర' వేగంగా రూపొందుతోంది. ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపాయి.

వివరాలు 

పోస్టర్‌  విడుదల 

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుండి మరొక భారీ అప్డేట్ రావడానికి రంగం సిద్ధమైంది. 'జటాధర' మూవీ టీజర్‌ను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు ఒక శక్తివంతమైన పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో హీరో సుధీర్ బాబు అభిమానులు గట్టి సంబరంలో మునిగిపోయారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుధీర్ బాబు చేసిన ట్వీట్