Siddharth: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన హీరో సిద్ధార్థ్!
ఈ వార్తాకథనం ఏంటి
హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్, ఆ తర్వాత అంతే వేగంగా క్రేజ్‌ను కోల్పోయాడు.
ఫలితంగా ఆయనకు అవకాశాలు తగ్గిపోగా, కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.
హీరోగా మాత్రమే కాకుండా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు సిద్ధార్థ్. తన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
Details
స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేయలేకపోయా
ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు అరుదైన ఓ వ్యాధి ఉందని, ఈ వ్యాధి అభిమానుల వల్లే వచ్చిందన్నారు.
ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు స్టార్‌డమ్ కోసం ఎంతో కష్టపడుతుంటారని, తాను కూడా అదే చేశానని చెప్పారు.
కానీ స్టార్ డం వచ్చిన తర్వాత తన అభిమానుల వల్ల ఓ రేర్ డిసీజ్ భారీన పడ్డారని చెప్పారు.
చాలామంది హీరోలు తమ స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తారని, కానీ తనకు మాత్రం అదే సమస్యగా మారిపోయిందన్నారు.
Details
కోలుకోవడానికి 8 సంవత్సరాలు పట్టింది
అభిమానులతో మాట్లాడాలంటే తనకు విపరీతమైన టెన్షన్ వస్తుందని, ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోవాలనుకుని డాక్టర్‌ను కూడా సంప్రదించానన్నారు.
అప్పుడే తనకు 'పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్' అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తెలిసిందన్నారు.
ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఏకంగా 7-8 సంవత్సరాల సమయం పట్టిందని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.
సిద్ధార్థ్ మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి అరుదైన వ్యాధులు కూడా ఉంటాయా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.