Page Loader
Sunny Leone : మరోసారి తెలుగులో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకోనున్న సన్నీ లియోన్.. 
మరోసారి తెలుగులో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకోనున్న సన్నీ లియోన్..

Sunny Leone : మరోసారి తెలుగులో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకోనున్న సన్నీ లియోన్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను సినిమాలు, ఐటెం పాటల ద్వారా మురిపించింది. ఇప్పుడు మళ్లీ ఓ తెలుగు చిత్రంలో ఐటెం సాంగ్‌తో సందడి చేయనుంది. అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ మోహన్, శ్రీవల్లి సమర్పణలో డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణంలో,రాజేష్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'త్రిముఖ'. ఈ సినిమాలో యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మొట్ట రాజేంద్రన్,ప్రవీణ్, అషు రెడ్డి, చిత్రం శ్రీను, షకలక శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వివరాలు 

'గిప్పా గిప్పా..' అంటూ సాగే ఐటెం సాంగ్‌

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 'గిప్పా గిప్పా..' అంటూ సాగే ఐటెం సాంగ్‌ని సన్నీ లియోన్‌పై చిత్రీకరించారు. యోగేష్ కల్లే, సన్నీ లియోన్ కాంబినేషన్‌లో ఈ పాట రూపొందింది. ఈ పాట ద్వారా సన్నీ లియోన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ పాటలో నటి సాహితి దాసరి, ఆకృతి అగర్వాల్‌లు కూడా కనిపించనున్నారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.