LOADING...
Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ'
మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ'

Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ'

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

యాక్షన్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నింటిలోను నింపుకొచ్చిన మాస్‌ మహారాజా రవితేజ పేరు ప్రత్యేకం. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్‌కు పిచ్చి ప్యాన్‌లు ఉన్నారు. రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'వెంకీ'. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందం కలసి చేసిన కాంబో సన్నివేశాలు సినిమాకు గొప్ప ఆకర్షణగా నిలిచాయి. ట్రైన్ ఎపిసోడ్ ప్రత్యేకంగా మరో మైలురాయిగా నిలిచింది. వేణుమాధవ్ పాడిన పాటలు అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందాయి.

Details

జూన్ 14న రీరిలీజ్

ఈ కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సినిమాను థియేటర్‌లో మళ్ళీ విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. ఇప్పటికే 2023 డిసెంబరులో 'వెంకీ' రీరిలీజ్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ మూవీని జూన్ 14న 4కే రిజల్యూషన్‌లో తెరక్కించనున్నారు. దీంతో ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు ఇప్పటికీ ట్రెండ్‌లో ఉన్నాయి. మొత్తానికి, ప్రేక్షకులకు మరోసారి ఫుల్ ఎనర్జీతో, వినోదంతో నిండిన సినిమా అనుభవం అందే అవకాశం సిద్దమైంది.