Page Loader
Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్

Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 27, 2024
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై మరింత హైప్‌ని క్రియేట్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ బెనిఫిట్ షోకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

Details

ఫస్ట్ షో టికెట్స్ షేర్ చేసిన అభిమాని

సెప్టెంబర్ 27న తెల్లవారుజామున 1.08 గంటలకు బెన్‌ఫిట్ షో వేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. యూకేలోని పికాడిల్లీ సినీ మల్టీప్లెక్స్ లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓ అభిమాని ఫస్ట్ షో టికెట్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూఎస్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సమయంలో బెనిఫిట్ షో వేయనున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని చిత్రయూనిట్ త్వరలో అధికారికంగా విడుదల చేయనుంది.