Page Loader
Thalivar 170 : రజనీకాంత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఇందులో ఇంకెవరు నటిస్తున్నారో తెలుసా 
ఇందులో ఇంకెవరు నటిస్తున్నారో తెలుసా

Thalivar 170 : రజనీకాంత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఇందులో ఇంకెవరు నటిస్తున్నారో తెలుసా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Oct 04, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ కొచ్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. షూటింగ్ నిమిత్తం చెన్నై నుంచి బయల్దేరిన రజినీని, పాత్రికేయులు పలు ప్రశ్నలు అడిగారు. తాను జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సామాజిక సందేశంతో కూడిందని, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నారు. అయితే టైటిల్ ఇంకా పెట్టలేదన్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని రజినీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియ‌ర్ రితికా సింగ్, దుషారా విజయన్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Embed

టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో 170వ సినిమా

https://twitter.com/LycaProductions/status/1709440718329295191