Loading...
Mahesh Babu New Look: సూపర్ స్టార్ నయా లుక్ అదుర్స్.. మహేశ్ బాబు ఫొటోలు వైరల్!
సూపర్ స్టార్ నయా లుక్ అదుర్స్.. మహేశ్ బాబు ఫొటోలు వైరల్!

Mahesh Babu New Look: సూపర్ స్టార్ నయా లుక్ అదుర్స్.. మహేశ్ బాబు ఫొటోలు వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ నాటికి సినిమా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహేశ్ బాబు తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా సూపర్‌ స్టార్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు

క్లీన్ షేవ్‌ లుక్‌లోకి మహేశ్ బాబు

'వారణాసి' కోసం మహేశ్ బాబు ఇంతకాలం ఫుల్ గడ్డం, పొడవాటి హెయిర్‌తో రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ వచ్చారు. సినిమాలోని పాత్రకు అనుగుణంగా ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో మహేశ్ బాబు మళ్లీ తన క్లీన్ షేవ్, స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లోకి వచ్చారు.

చాలా రోజుల తర్వాత మహేశ్ బాబును ఇలా క్లీన్ షేవ్ లుక్‌లో చూసిన అభిమానులు ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

బాబు తన సాధారణ స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబు కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలు

శ్రీరాముడి పాత్ర కోసమేనా ఈ గెటప్?

'ఏమున్నాడ్రా బాబు', 'సూపర్ స్టార్ సూపర్బ్' అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మహేశ్ బాబు నయా లుక్‌పై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది.

మహేశ్ బాబు లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడంతో 'వారణాసి'లో శ్రీరాముడి పాత్రకు సంబంధించిన సన్నివేశాల కోసమే ఆయన ఈ గెటప్ మార్చుకున్నారా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. 'వారణాసి'లో మహేశ్ బాబు 'రుద్ర' అనే పాత్రలో కనిపించనున్నారు.

భారీ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పౌరాణిక అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

భారీ అంచనాలతో 'వారణాసి'

ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న మహేశ్ బాబు లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఏదేమైనా.. మహేశ్ బాబు క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న నయా లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మహేశ్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి తొలిసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'వారణాసి' చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT