Supritha : సురేఖవాణి కూతురు సుప్రితపై ట్రోల్స్ వర్షం.. ఎందుకంటే
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో BRS పార్టీ తరఫున కారు ముందు నిలబడిన సుప్రీత, BRSను గెలిపించమని కోరుతూ వీడియో సైతం చేసింది. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో పాత వీడియోని డిలీట్ చేసి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను షేర్ చేసింది.ఈ మేరకు శుభాకాంక్షలు సైతం పెట్టింది.దీంతో నెటిజన్లు ఈ తల్లి కూతుళ్లపై ట్రోల్స్ చేస్తున్నారు. రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు.మొదట BRSకు సపోర్ట్ చేశాను. అందులో తప్పేముంది. తర్వాత గెలిచిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పాను.దీనికే ట్రోల్ చేయడమేంటి, మీకేం అన్యాయం చేశానని ఆవేదన వ్యక్తం చేసింది.