Suri's 'Mandadi: ఓటీటీలోకి వచ్చేసిన సూరి 'మండాడి'.. నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచే స్ట్రీమింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'మండాడి' కూడా ఒకటిగా నిలిచింది. టాలెంటెడ్ నటుడు సూరి హీరోగా నటించిన ఈ సముద్ర నేపథ్య రేసింగ్ డ్రామాలో టాలీవుడ్ యువ నటుడు సుహాస్ విలన్ పాత్రలో కనిపించారు. దర్శకుడు మథిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో సూరి కెరీర్‌లోనే రికార్డు స్థాయి విజయంగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా 'మండాడి'కి మంచి ఆదరణ కొనసాగింది. అంతేకాదు, ఐమ్యాక్స్ వెర్షన్‌కు డిమాండ్ రావడంతో ఈ నెల 9వ తేదీ నుంచి మరోసారి థియేటర్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
వివరాలు
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు..
ఇదిలా ఉండగానే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించింది.
'మండాడి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఇకపై ఇంటి నుంచే సినిమాను వీక్షించవచ్చు.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎల్రెడ్ కుమార్ సంతానం నిర్మించారు.
సూరి, సుహాస్‌ల విభిన్నమైన పాత్రలు, సముద్ర నేపథ్యం, రేసింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.