LOADING...
Karuppu: షూటింగ్ పూర్తయినా విడుదలలో ఆలస్యం.. సూర్య 'కరుప్పు'పై కొత్త వివాదం
షూటింగ్ పూర్తయినా విడుదలలో ఆలస్యం.. సూర్య 'కరుప్పు'పై కొత్త వివాదం

Karuppu: షూటింగ్ పూర్తయినా విడుదలలో ఆలస్యం.. సూర్య 'కరుప్పు'పై కొత్త వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరో సూర్య నటిస్తున్న 45వ సినిమా 'కరుప్పు' ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యాక్షన్-ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయినా ఇప్పటివరకు విడుదల తేదీ ప్రకటించకపోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో సినిమా విడుదలపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. సినిమా పనులన్నీ 2025 నవంబర్ నాటికే పూర్తయ్యాయని సమాచారం.

వివరాలు 

దర్శకుడు ఆర్జే బాలాజీకి ఇవ్వాల్సిన పూర్తి పారితోషికం ఇంకా చెల్లించలేదని సమాచారం 

ఇదిలా ఉండగా, సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో కొత్త చర్చ మొదలైంది. ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ, నిర్మాత ఎస్.ఆర్. ప్రభు,హీరో సూర్యపై కేసు వేయాలని భావిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా పూర్తయినా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నిర్మాత కావాలనే విడుదలను వాయిదా వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దర్శకుడు ఆర్జే బాలాజీకి ఇవ్వాల్సిన పూర్తి పారితోషికం ఇంకా చెల్లించలేదని కూడా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. OTT డీల్ పూర్తయ్యాకే మొత్తం పారితోషికం సెటిల్ చేస్తామని నిర్మాత చెప్పడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని సమాచారం. ఈ ఆలస్యం వల్ల దర్శకుడి కెరీర్‌కు నష్టం జరుగుతోందని,మంచి అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

దర్శకుడు,నిర్మాతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: నిర్మాణ సంస్థ

అంతేకాకుండా మంచి సామర్థ్యం ఉన్న ఈ సినిమా ఆలస్యం కారణంగా ప్రభావితం అవుతుందని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదాలపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ, దర్శకుడు ఆర్జే బాలాజీ,నిర్మాతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవన్నీ కేవలం పుకార్లేనని వారు పేర్కొన్నారు. ఇక ఈ వివాదాలన్నీ త్వరగా ముగిసి సినిమా థియేటర్లలో విడుదలైతే, సూర్య ఖాతాలో మరో విజయవంతమైన చిత్రం చేరుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement