
Suriya-Karthi: దర్శకుడు ప్రేమ్ కుమార్ కు 'థార్' గిఫ్ట్.. సర్‌ప్రైజ్ చేసిన సూర్య, కార్తి!
ఈ వార్తాకథనం ఏంటి
కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మెయ్యజగన్' (తెలుగులో 'సత్యం సుందరం') ఫీల్‌గుడ్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్‌కు తాజాగా ఒక ప్రత్యేకమైన కల నెరవేరింది.
హీరోలైన సూర్య, కార్తి కలసి ఆయనకు ఎంతో ఇష్టమైన కారును బహుమతిగా ఇచ్చారు.
ప్రేమ్ కుమార్ ఎంతోకాలంగా మహీంద్రా థార్ 5-డోర్ వర్షన్‌ను కోరికగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా Roxx AX 5L తెలుపు రంగు వేరియెంట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన, ముందుగా దానిని బుక్ చేసినప్పటికీ డెలివరీకి ఏడాది సమయం పడుతుందని తెలిసి నిరాశ చెంది కొనుగోలు ఆలోచనను విరమించుకున్నారు.
అంతేకాక అప్పటికే ఉన్న డబ్బు కూడా ఇతర అవసరాలకు ఖర్చయిపోయింది.
Details
కార్తి చేతులో తాళాలు అందుకున్న దర్శకుడు
అయితే, సూర్య ప్రేమ్ కుమార్‌కు సందేశం పంపి కార్ ఫొటో షేర్ చేస్తూ "కారు వచ్చేసింది" అని చెప్పిన సందర్భాన్ని దర్శకుడు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.
అప్పుడు అందుకున్న ఫొటోలో తన కలల కారు ఉండడం చూసి షాక్‌కు లోనయ్యారట.
తాను ఎంతగా కోరుకున్న మహీంద్రా థార్‌ను సూర్య గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా కార్తి చేతుల మీదుగా కారు తాళాలు అందుకున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ, 'ఇది ఒక గిఫ్ట్ కాదు, అన్న ఒక తమ్ముడి కలను నెరవేర్చిన దృశ్యమే'' అన్నారు.
'మెయ్యజగన్' చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించడం తెలిసిందే.ఈ క్రమంలో దర్శకుడికి ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ బహుమతి ఆయన జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా నిలిచింది.