#Suriya42: సూర్య సినిమాకు ప్రచారంలో ఉన్న క్రేజీ టైటిల్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య కెరీర్లో 42వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీలో రిలీజ్ అవుతుంది.
బాహుబలిని తలదన్నే సినిమాగా రూపుదిద్దుకుంటుందంటూ ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది.
స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా టైటిల్ ని, రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 16వ తేదీన ప్రకటించనున్నారట.
ఈ మేరకు గురువారం సాయంత్రం తమ అధికారిక సోషల్ హ్యాండిల్ ద్వారా వెల్లడి చేశారు. అయితే ఈ సినిమాకు అగ్నీశ్వరన్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయిందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
#Suriya42: టైటిల్, రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చేసింది
A Mighty Valiant Saga in 10 Languages!!! 3D🔥
— UV Creations (@UV_Creations) April 6, 2023
Most Expected #Suriya42 Title + Release Date Announcement on 16th April, Sunday, 9.05 am.
Warrior is coming to storm 🔥#Suriya42Title @Suriya_offl @DishPatani @directorsiva @StudioGreen2 @UV_Creations @kegvraja @ThisIsDSP pic.twitter.com/y9vD7V5PvR