Eagle: ఇప్పుడు పద్ధతైన దాడి.. ఆ తరువాత విధ్వంసాల జాతర అంటున్న రవితేజ
మరో రెండు రోజుల్లో మాస్ మహారాజా రవితేజ ఈగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉండగానే మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసేందు మాస్ మహారాజా పద్దతైన దాడితో కొద్దిసేపటి క్రితం మన ముందుకు వచ్చాడు. ఈగల్ రెండో ట్రైలర్ లో మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను మరింత ఊపేశాడు డైరెక్టర్. ఈ కొత్త ట్రైలర్ రవితేజ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపించాడు. ఈ ట్రైలర్ లో రవితేజ యాక్షన్,మాస్ లుక్ తో సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. పూర్తి యాక్షన్‌గా సీక్వెన్స్‌తో ఈకొత్త ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తిగా ఉంది.