LOADING...
Rashmika Birthday: రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సర్‌ప్రైజ్.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్!
రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సర్‌ప్రైజ్.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్!

Rashmika Birthday: రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సర్‌ప్రైజ్.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న రష్మిక తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమెకు పెళ్లి తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించారు. కొడగు సంప్రదాయంలో వేడుకలు రష్మిక స్వస్థలమైన కూర్గ్ (కొడగు)లో జరిగిన ఈ వేడుకల్లో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. పుట్టినరోజు సందర్భంగా రష్మిక, తన భర్త విజయ్‌తో కలిసి పాడి శ్రీ ఇగ్గుతప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. కొడవ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన రష్మిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలు

తండ్రి నుంచి స్పెషల్ గిఫ్ట్ 'సెరెనిటీ

ఈ వేడుకల్లో మరో ప్రత్యేక ఆకర్షణ రష్మిక తండ్రి మదన్ ఇచ్చిన బహుమతి. విరాజ్‌పేట సమీపంలో ఉన్న ఖరీదైన విల్లాను ఆయన తన కూతురికి కానుకగా అందించారు. ఆ విల్లాకు 'సెరెనిటీ' అనే పేరు పెట్టడం విశేషం. ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పెళ్లి తర్వాత కూతురికి గుర్తుండిపోయే బహుమతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జంట తమ గ్రామ ప్రజలకు అన్నదానం చేయడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం ద్వారా తమ సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది.

వివరాలు

పెళ్లి నుంచి బర్త్‌డే వరకు ప్రత్యేక వేడుకలు

గత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య విజయ్, రష్మికల వివాహం జరిగింది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 30వ ఏట అడుగుపెట్టిన రష్మికకు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

వివరాలు

క్రేజీ ప్రాజెక్టులతో బిజీ

వ్యక్తిగత జీవితంతో పాటు రష్మిక కెరీర్ కూడా ప్రస్తుతం శిఖరాగ్రంలో ఉంది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, త్వరలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రణబాలి' చిత్రంలో మళ్లీ విజయ్ సరసన కనిపించనుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా ఆమె జోరు కొనసాగుతోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ నటిస్తున్న 'కాక్‌టెయిల్-2' చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా 2026 జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి వ్యక్తిగతంగా కూడా, వృత్తిపరంగానూ రష్మిక మందన్నా ప్రస్తుతం అద్భుతమైన దశలో దూసుకుపోతోంది.

Advertisement