Page Loader
Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. 'పుష్ప3' గురించి తాజా అప్‌డేట్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. 'పుష్ప3' గురించి తాజా అప్‌డేట్!

Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. 'పుష్ప3' గురించి తాజా అప్‌డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 03, 2024
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2: ది రూల్' డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొని ఉండగా, తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఆస్కార్ విజేత సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి తన టీమ్‌తో దిగిన ఫొటో వెనుక 'పుష్ప3: ది ర్యాంపేజ్' టైటిల్ కనిపించడంతో పుష్ప 3 ఉంటుందనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ టైటిల్ చూస్తే, 'పుష్ప2' చివర్లో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఉండే అవకాశం ఉందని అర్థమవుతోంది. కొంతకాలం క్రితమే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ 'పుష్ప3' గురించి క్లారిటీ ఇచ్చారు.

Details

పుష్ప 3 తప్పకుండా చేస్తా: సుకుమార్

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ 'పుష్ప వైల్డ్ జాతర' లోనూ దర్శకుడు సుకుమార్ మూడో భాగంపై స్పందించారు. తాను అల్లు అర్జున్‌ని మూడేళ్లు కష్టపెట్టానని, మళ్లీ మూడేళ్లు తనకు ఇస్తే తప్పకుండా 'పుష్ప3' చేస్తానని తెలిపారు. మూడో భాగం రెండవ భాగం పూర్తి అయిన వెంటనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, 'పుష్ప3' పనులు రెండు, మూడేళ్ల తర్వాతే మొదలవుతాయని చిత్ర యూనిట్ పేర్కొంది.