Pushpa 2: పుష్ప 2 అభిమానులకు సర్‌ప్రైజ్.. 11వ తేదీ నుంచి అదనపు యాక్షన్ సీన్స్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, రష్మిక మంధాన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లను సాధించింది. పుష్ప కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను నెలకొల్పింది.
డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటివరకు రూ.1800 కోట్లను రాబట్టింది. ఇంకా కలెక్షన్లు కొనసాగుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Details
20 నిమిషాల పాటు అదనపు సన్నివేశాలు
వీక్షకుల్ని మరింత ఆకర్షించేందుకు పుష్ప 2 సినిమాలో 20 నిమిషాల అదనపు సన్నివేశాలు జోడించాలని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సన్నివేశాలలో ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఉంటాయని వారు తెలిపారు. ఈ కొత్త సన్నివేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి థియేటర్లలో ప్రసారం కానున్నాయి.
వీకెండ్ సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో పుష్ప 2 కలెక్షన్లు మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం వర్కవుట్ అయితే ఈ మూవీ రూ.2వేల కోట్ల మార్క్‌ను దాటడం కష్టమేమీ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ నిర్ణయం ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.