Suriya 45 :సూర్య 45.. ఏఆర్ రెహమాన్ స్థానంలో సాయి అభ్యంకర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కెరీర్‌లో కొత్త అధ్యాయాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన సూర్య, ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్య 44' షూటింగ్ దశలో ఉన్నాడు. మరోవైపు, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 కూడా చేయడం తెలిసిందే. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ఇంటెన్స్ ప్రీ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని భావించారు. మేకర్స్ ఆయన ప్లేస్‌లో యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేశారు.
అతృతుగా ఎదురుచూస్తున్నసూర్య ఫ్యాన్స్
ఇక సినిమాటోగ్రఫీ విభాగంలో పాపులర్ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇటీవల ఆర్జే బాలాజీ అండ్ టీం కోయంబత్తూరు అగ్రికల్చర్ కాలేజీ క్యాంపస్‌లో సెట్స్ పనులను ప్రారంభించారు. ఈ పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేస్తూ సూర్య సార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన ప్రాజెక్ట్ అందించేందుకు ఆర్జే బాలాజీ కట్టుబడి ఉన్నారు. త్వరలో సినిమా టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు బాలాజీ తెలిపారు. సూర్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు.