Trisha: త్రిష కెరీర్‌పై సస్పెన్స్.. త్వరలోనే క్లారిటీ రానుందా?
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన సినీ ప్రయాణానికి గుడ్‌బై చెప్పబోతుందా అన్న చర్చ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో విజయ్‌తో ఆమెకున్న సాన్నిహిత్యం, అలాగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిష త్వరలోనే నటనకు స్వస్తి చెప్పే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడం, ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో ఆమె కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే త్రిష వెండితెరకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశముందని తమిళ మీడియా పేర్కొంటోంది.
వివరాలు
జూలై 10న విశ్వంభర రిలీజ్
ప్రస్తుతం త్రిష నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సూర్య - ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న కరుప్పు చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చిరంజీవి సరసన నటించిన విశ్వంభర జూలై 10న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్లు పూర్తయ్యాక త్రిష తన భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, విజయ్ విజయానికి త్రిష స్టార్ క్యాంపెయినర్‌గా మారబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, 'విశ్వంభర' త్రిష కెరీర్‌లో చివరి తెలుగు సినిమా అయ్యే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.