Page Loader
SVCC37: బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ ఫిలిం: వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ లాంచ్ 
SVCC37: బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ ఫిలిం: వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ లాంచ్

SVCC37: బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ ఫిలిం: వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ లాంచ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 04, 2024
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్దు హీరోగా సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది.ఈరోజు వైష్ణవి చైతన్య పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో వైష్ణవి నలుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తోంది."త్వరలోనే ఆమె అద్భుతమైన ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి!" అనే క్యాప్షన్‌తో మేకర్స్ ముందుకు వచ్చారు. SVCC37 చిత్రంలో వైష్ణవి ముస్లిం అమ్మాయిగా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ నుండి తెలుస్తోంది. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్