LOADING...
Tamannaah: రాజమౌళి విజన్‌ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్
రాజమౌళి విజన్‌ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్

Tamannaah: రాజమౌళి విజన్‌ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. కెరీర్‌లో బలమైన పాత్రలు చేస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ.. ఇటీవల కాలంలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌కే పరిమితమవుతుండటంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

రూ.200 కోట్ల బడ్జెట్ అంటే భారీ రిస్క్..

తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'బాహుబలి' సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం గొప్పదిగా కనిపిస్తోందని తెలిపింది. అయితే ఆ సినిమా తెరకెక్కుతున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పింది. ఆ రోజుల్లో ఒక ప్రాంతీయ భాషా సినిమాకు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ పెట్టడం చాలా రిస్క్‌గా భావించేవారని తమన్నా పేర్కొంది.

వివరాలు

తమన్నా కామెంట్స్ వైరల్..

అప్పటి ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే అది ఫ్లాప్ అయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్ట్‌లా కనిపించిందని చెప్పింది. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం తన విజన్‌పై పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్లారని తెలిపింది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారని, అందుకే 'బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుందని తమన్నా చెప్పుకొచ్చింది. లేదంటే భారీ సమస్యలు ఎదురయ్యేవని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement