LOADING...
Tamannaah: బాలీవుడ్ బయోపిక్‌లో తమన్నా భాటియా.. ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్?
బాలీవుడ్ బయోపిక్‌లో తమన్నా భాటియా.. ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్?

Tamannaah: బాలీవుడ్ బయోపిక్‌లో తమన్నా భాటియా.. ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బహుళ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న నటి తమన్నా భాటియాకు బాలీవుడ్ నుంచి మరో కీలక అవకాశం దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో మహానుభావుడిగా పేరొందిన దర్శకుడు 'వి. శాంతారాం' జీవితాన్ని ఆవిష్కరించే బయోపిక్‌లో తమన్నా నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు 'చిత్రపతి వి. శాంతారాం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో నటిస్తుండగా, జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్న 'నటసామ్రాట్' చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు.

Details

వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం

శాంతారాం కెరీర్‌లో కీలకమైన అనేక చిత్రాల్లో నటి సంధ్య హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. హిందీ, మరాఠీ సినీ రంగాల్లో సంధ్యకు ఉన్న గుర్తింపు దృష్ట్యా, ఈ బయోపిక్‌లో ఆమె పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ విన్న వెంటనే తమన్నా ఎంతో ఆసక్తి చూపి వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె కెరీర్‌లో, ఈ పాత్ర మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. వి. శాంతారాం సినీ ప్రయాణం, ఆయన చేసిన చిత్ర ప్రయోగాలు, వ్యక్తిగత జీవితంలోని పలు కీలక అధ్యాయాలను ఈ చిత్రంలో ప్రదర్శించనున్నట్లు తెలిసింది.

Advertisement