Page Loader
Odela 2: క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా 
Odela 2: క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా

Odela 2: క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌లో తమన్నా భాటియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 01, 2024
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చివరిసారిగా బాంద్రా (మలయాళం)భోళా శంకర్(తెలుగు)లో కనిపించింది. ఇప్పుడు, మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ ముందుకి వచ్చింది తమన్నా. 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ఒదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ను మేకర్స్ నేడు అనౌన్స్ చేశారు. ఈ చిత్రం మొదటి భాగానికి సంపత్ నంది క్రియేట్ చేసిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఆహాలో విడుదలైన ఈ సినిమాలో హెబ్బా పటేల్ నటించింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓదెల 2 అనే టైటిల్‌తో ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ కానుంది.

Details 

బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్

పవిత్ర నగరమైన కాశీలో ఈరోజు చిత్రీకరణ ప్రారంభం కానుండగా, తమన్నా ఇందులో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మధు క్రియేషన్స్‌కు చెందిన డి మధు, సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ బహుభాషా వెంచర్‌కు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తమన్నా భాటియా ఒదెలా 2తో మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సంపత్ నంది చేసిన ట్వీట్