Page Loader
Tamannaah : మరో ఐటెం సాంగ్ లో తమన్నా.. ఊపు ఊపిందిగా..

Tamannaah : మరో ఐటెం సాంగ్ లో తమన్నా.. ఊపు ఊపిందిగా..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నాకు భారతదేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆమెకు దక్షిణభారతదేశంలోనే కాదు,ఉత్తరభారతదేశంలో కూడా విశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత,ఆమె పలు ఐటెం సాంగ్స్‌ లో కూడా కనిపించింది. తెలుగు సినిమాలతో పాటు తమిళం,మలయాళం భాషల్లోనూ ఆమె ఈ తరహా పాటల్లో నటించింది. తమన్నా సుందర రూపానికి అభిమానులు ఎంతగానో ఆకర్షితులవుతుంటారు. ముఖ్యంగా ఆమె ఐటెం సాంగ్స్‌ లో కనిపించే అందాల హడావిడి గురించి చెప్పుకుంటే మాటలే సరిపోవు. తాజాగా ఆమె మరో సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ లో మెరిసింది.'రైడ్-2' అనే తాజా సినిమాలో ఆమె నటించిన ఐటెం సాంగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.

వివరాలు 

యూత్‌ను మెస్మరైజ్ చేసేలా ఆమె హాట్ లుక్ 

ఈ ఫొటోలు వైరల్ కావడంతో,చిత్రబృందం తక్షణమే 'నటాషా' అనే పాటను అధికారికంగా విడుదల చేసింది. ఈ పాటలో తమన్నా ఎక్స్‌ప్రెషన్స్,డ్యాన్స్ మూవ్‌మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. తన శరీర భంగిమలతో ఆమె వేసిన స్టెప్పులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యూత్‌ను మెస్మరైజ్ చేసేలా ఆమె హాట్ లుక్ కనిపిస్తోంది.ఈ పాటలో తమన్నా చూపిన ఎనర్జీ చూసి అభిమానులు"ఈ సాంగ్ తప్పకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే సందేహమే లేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'రైడ్-2' సినిమాలో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా,వాణీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. రాజ్ కుమార్ గుప్తా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.2018లో వచ్చిన 'రైడ్' చిత్రానికి ఇది కొనసాగింపు (సీక్వెల్)గా రూపొందుతోంది.