
Raid 2: 'రైడ్ 2'లో తమన్నా స్పెషల్ సాంగ్ కథలో భాగమే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
తమన్నా 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత, ఇప్పుడు అదే ఉత్సాహంతో 'రైడ్ 2' సినిమాలో ఒక ప్రత్యేక గీతంతో అలరించనుంది.
ఇటీవల విడుదలైన ఈ పాట మంచి స్పందన పొందుతోంది. అయితే ఈ పాట కథతో సంబంధం లేకుండా ఉద్దేశపూర్వకంగా చేర్చారని, ఇది కేవలం ప్రచారార్ధంగా ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అలాగే, ఈ పాట కారణంగానే చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ బదులు 'యూ/ఏ' సర్టిఫికెట్ లభించిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై చిత్ర నిర్మాతలు స్పందించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించిన 'రైడ్ 2' అనే క్రైమ్ థ్రిల్లర్‌ను రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు.
Details
మే 1 విడుదలకు సిద్ధం
మే 1న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, 'తమన్నా పాట వల్లే సర్టిఫికెట్ మారిందన్నది అసత్యం.
సినిమా 'యూ' సర్టిఫికెట్ పొందాలంటే కొన్ని సన్నివేశాలను కట్ చేయాలన్న సూచనలున్నాయి. కానీ మేము ఏ మార్పులు చేయలేదు. ఆ పాట ప్రచారానికి మాత్రమే కాదు, కథకు భాగమే.
Details
మూడో పార్ట్ కూడా సిద్ధం
థ్రిల్లర్ చిత్రాల్లో ఇటువంటి పాటలు కొంత బలవంతంగా అనిపించొచ్చు, కానీ సినిమాను చూసిన తర్వాత అందరికీ స్పష్టత వస్తుందని వివరించారు.
అలాగే 'రైడ్' మొదటి భాగానికి కొనసాగింపుగా రూపొందిన 'రైడ్ 2' తర్వాత 'రైడ్ 3' కూడా రూపొందనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
'మొదటి భాగం తీయగానే మేము రెండో పార్ట్‌పై చర్చించాం. ఇప్పుడు రెండో భాగం పూర్తవుతున్న నేపథ్యంలో మూడో పార్ట్ కథ కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.