LOADING...
Tamannah : అతనే చాలా లక్కీ ఫెలో.. అతన్నే పెళ్లి చేసుకుంటా: తమన్నా
అతనే చాలా లక్కీ ఫెలో.. అతన్నే పెళ్లి చేసుకుంటా: తమన్నా

Tamannah : అతనే చాలా లక్కీ ఫెలో.. అతన్నే పెళ్లి చేసుకుంటా: తమన్నా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది వయస్సు ఎంత వచ్చినా ఆమె అందం మాత్రం ఏ ఒక్క అంగుళం కూడా తగ్గలేదని నిరూపిస్తూ ముందే సాగుతోంది. గతంలో విజయ్ వర్మతో ప్రేమ సంబంధం ఉండగా, మధ్యలోనే బ్రేకప్ ప్రకటించడంతో తన కెరీర్‌పై మరింత దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఆమె మళ్లీ ప్రేమలో పడిందా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో తెగ వస్తున్నాయి. ఎందుకంటే, తమన్నా ఎక్కువగా ప్రేమ, పెళ్లి విషయాల గురించి మాట్లాడుతూ వస్తోంది. ఇటీవలే ఆమె తాను ఎలా జీవితాన్ని గడపాలనుకుంటున్నానో చెప్పింది.

వివరాలు 

గత జన్మలో ఎక్కడో పుణ్యం చేసి ఉండాలి

"నేను ఖచ్చితంగా ఒకరోజు పెళ్లి చేసుకుంటాను. కానీ ఎవరిని పెళ్లి చేసుకుంటాను అనేది ఇప్పటికీ సస్పెన్స్ . నా భర్త నాకు తమన్నా లాంటి భార్య దొరికినందుకు గత జన్మలో ఎక్కడో పుణ్యం చేసి ఉండాలి అని అనుకుంటూ ఉండాలి. ఆ విధంగానే నేను అతన్ని చూసుకుంటాను. నన్ను కూడా అంత ప్రేమగా, కేరింగ్ గా చూసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి దొరికితే, ఆలస్యం లేకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంపై నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. నా వయస్సు కూడా ఈ నిర్ణయానికి అడ్డంకిగా ఉండదు." అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్

ఈమె ఇలాంటి మాటలు చెబుతుండటంతో.. కచ్చితంగా ఎవరితోనో లవ్ లో ఉందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.