Page Loader
Kollywood: తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత 
Kollywood: తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Kollywood: తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Mar 30, 2024
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ(48) శుక్రవారం (మార్చి 29) రాత్రి గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. శుక్రవారం ఛాతీ నొప్పితో బాధపడుతూ చెన్నైలోని కొట్టివాకంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని పురసైవాల్కంలోని ఆయన నివాసానికి తరలించారు. అయన ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈయన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా విలన్ గా చేశారు. సినిమాల కంటే ముందు అయన సీరియల్స్ లో నటించారు. అటు తరువాత ఆయన విలన్ గా మారి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు.

Details 

టక్ జగదీష్‌లో మెయిన్ విలన్‌గా డానియల్ బాలాజీ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ, రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత చివరగా నాని నటించిన టక్ జగదీష్‌లో మెయిన్ విలన్‌గా డానియల్ బాలాజీ కనిపించాడు. ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగున్నాయని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 విలన్  డేనియల్ బాలాజీ కన్నుమూత