
గుండెపోటుతో కన్నుమూసిన తమిళ నటుడు జి మరిముత్తు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు, దర్శకుడు జి మరిముత్తు ఈరోజు ఉదయం 8:30గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు.
సీరియల్ కి డబ్బింగ్ చెబుతుండగా గుండెపోటుతో మరిముత్తు కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. కానీ గుండెపోటు కారణంగా హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలోనే మరిముత్తు తుదిశ్వాస విడిచారు.
58ఏళ్ల వయసులో మరణించిన మరిముత్తు, తమిళంలో 80కి పైగా సినిమాల్లో నటించారు.
ఇటీవల రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఒకడిగా మరిముత్తు కనిపించారు.
మరిముత్తు సడెన్ గా మరణించడం తమిళ సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళ హీరోలు, నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జి మరిముత్తు మరణంపై సంతాపం ప్రకటించిన యాక్టర్ ప్రసన్న్
Deeply shattered to know the passing away of director G Marimuthu. We did #KannumKannum and #Pulivaal together. We had a brothers like bond. We agreed to disagree on many. His life wasn't easy at all. As an actor finally he was doing very well. He shud've been there for a while… pic.twitter.com/KewaK2Gzxk
— Prasanna (@Prasanna_actor) September 8, 2023