LOADING...
S Srinivasan: రూ.5 కోట్లు మోసం కేసులో కోలీవుడ్‌ నటుడు శ్రీనివాసన్‌ అరెస్ట్‌
రూ.5 కోట్లు మోసం కేసులో కోలీవుడ్‌ నటుడు శ్రీనివాసన్‌ అరెస్ట్‌

S Srinivasan: రూ.5 కోట్లు మోసం కేసులో కోలీవుడ్‌ నటుడు శ్రీనివాసన్‌ అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ నటుడు ఎస్. శ్రీనివాసన్‌ (S. Srinivasan) ను దిల్లీ పోలీసులు బుధవారం రోజు అరెస్ట్‌ చేశారు. రూ.1000 కోట్ల రుణం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చి,ఓ సంస్థ నుండి ముందస్తుగా రూ.5 కోట్లు తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. శ్రీనివాసన్‌ తనను తాను"పవర్‌ స్టార్‌"గా ప్రకటించుకోవడంతో,కొందరు కోలీవుడ్‌ అభిమానులు కూడా ఆయన్ని అదే పేరుతో పిలుస్తుంటారు. పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,2018లో శ్రీనివాసన్‌ ఓ ప్రైవేట్‌ సంస్థకు రూ.1000 కోట్ల రుణాన్ని అందిస్తానని వాగ్దానం చేశారు. అయితే, రుణం ప్రాసెస్‌ చేయించాలంటే ముందుగా కొంత మొత్తం అవసరమని చెప్పి, వారు రూ.5కోట్లు ముందుగా ఇచ్చారు. రుణం అమలు కాకపోతే, ఇచ్చిన డబ్బును 30రోజుల్లో తిరిగి చెల్లిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు.

వివరాలు 

,2011లో వచ్చిన'లతిక'అనే చిత్రంలో హీరోగా..

కానీ ఆ డబ్బును తన వ్యక్తిగత అవసరాల కోసం,ముఖ్యంగా సినిమా నిర్మాణానికి వినియోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తుదకు రుణం కూడా రాకపోవడంతో,మోసపోయిన సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిల్లీ పోలీసులు చెన్నైలో శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేశారు.శ్రీనివాసన్‌ 2010లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పలు తమిళచిత్రాల్లో నటించిన ఆయన,2011లో వచ్చిన'లతిక'అనే చిత్రంలో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆసినిమాకు మంచి స్పందన రావడంతో ఆయనకు వరుసఅవకాశాలు వచ్చాయి.ఇప్పటి వరకు 60కి పైగా తమిళ చిత్రాల్లో నటించారు.నటుడిగా మాత్రమే కాకుండా,పలు సినిమాల్లో హాస్యనటుడిగా కూడా అలరించారు. అంతేగాక కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.నటనతోపాటు వ్యాపారరంగంలోకి కూడా ప్రవేశించిన ఆయన,చెన్నైలో ఓ ఫైనాన్స్‌ సంస్థను స్థాపించారు. అదేసంస్థ పేరుతో ఈమోసం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.