LOADING...
Thandel: ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!
ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!

Thandel: ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్‌' భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా పాటలు, డైలాగులు విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఇక విడుదలైన రోజు నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రత్యేకంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి రోజే భారీ కలెక్షన్లు సాధించింది. విదేశాల్లో మొదటిరోజు 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ, "అలలు మరింత బలపడుతున్నాయి" అనే క్యాప్షన్‌తో ఓ పోస్టర్‌ను పంచుకుంది.

Details

ట్రెండింగ్ లో తండెల్

దీంతో త్వరలోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక బుక్‌మై షో వేదికగా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన 24 గంటల్లో 2 లక్షలకు పైగా 'తండేల్‌' టికెట్లు అమ్ముడై, ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య , సాయిపల్లవి తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వీరి మధ్య హృద్యమైన ప్రేమకథను సినిమాటిక్ హంగులతో మేళవించి, భావోద్వేగాలను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విజయం సాధించారు.