Thandel Review: 'తండేల్' మూవీ రివ్యూ.. ప్రేమ, విభేదాల మధ్య హృదయాన్ని తాకే కథ!
ఈ వార్తాకథనం ఏంటి
చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమా 'తండేల్'. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం!
కథ
శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు(నాగచైతన్య)సముద్రంలో చేపల వేట చేస్తూ తన సహచరులకు అండగా నిలుస్తుంటాడు. అతనికి సత్య (సాయి పల్లవి) అంటే ప్రాణం.
అయితే కొన్ని అనుకోని పరిణామాల వల్ల రాజు చేపల వేటకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ కోస్టల్ గార్డ్స్ అతన్ని అరెస్టు చేస్తారు.
అతన్ని విడుదల చేయించేందుకు సత్య చేసిన ప్రయత్నాలు, ఆమె ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంది? అనే అంశాల ఆధారంగా కథ ముందుకు సాగుతుంది.
Details
ప్లస్ పాయింట్స్
కథలో వాస్తవికత, బలమైన ఎమోషన్లు, ప్రేమ ట్రాక్ నచ్చేలా ఉన్నాయి.
నాగచైతన్య, సాయి పల్లవి పాత్రలు ఎమోషనల్ కంటెంట్‌ను మరింత బలంగా చేశాయి.
హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది.
దర్శకుడు చందూ మొండేటి కథను చాలా లోతుగా మలచి, ఎమోషనల్ సీన్స్‌ను హైలైట్ చేశాడు.
సాయి పల్లవి నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది, ముఖ్యంగా ఆమె కళ్లలో కనిపించే భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయి.
షామ్ దత్ సినిమాటోగ్రఫీ సినిమాకు గొప్ప విజువల్ టచ్ ఇచ్చింది.
దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు బాగా ఫీల్ తెచ్చాయి.
Details
మైనస్ పాయింట్స్
కొన్ని సన్నివేశాలు అనవసరంగా లాగ్ అయ్యాయి.
కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది.
హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరింత క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన బలం.
ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుండేది.
బన్నీ వాసు నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
Details
తీర్పు
'తండేల్' ఒక డీసెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ. కథలోని ఎమోషన్స్, నాగచైతన్య - సాయి పల్లవి నటన సినిమాను మరింత బలంగా మార్చాయి.
కొంతవరకు నెమ్మదిగా నడిచినా బలమైన కథ, ఫీల్-గుడ్ సీన్స్ సినిమాను మెచ్చుకునేలా చేస్తాయి.
మంచి ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.