Page Loader
NTR : ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తారక్‌ యాక్షన్‌ మూవీ.. నవంబరులో ప్రారంభం
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తారక్‌ యాక్షన్‌ మూవీ.. నవంబరులో ప్రారంభం

NTR : ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తారక్‌ యాక్షన్‌ మూవీ.. నవంబరులో ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

'దేవర' విజయంతో జూనియర్ ఎన్టీఆర్‌ మంచి ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వార్‌ 2' షూటింగ్‌లో ఆయన బీజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న స్పై పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక, 'వార్‌ 2' పూర్తి కాగానే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నెక్స్ట్‌ సినిమా కోసం రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేవలం కొద్ది మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం.

Details

సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం

తాజా సమాచారం ప్రకారం, నవంబర్‌ చివర్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ప్రశాంత్‌నీల్‌ ఈ షూటింగ్‌ కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పటికీ, తారక్‌ మాత్రం సంక్రాంతి తరువాత షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని తెలుస్తోంది. 'వార్‌ 2' పూర్తయిన తరువాత, ఆయన ప్రశాంత్‌నీల్‌ చిత్రానికి అనుగుణంగా తన లుక్‌ను సెట్‌ చేసుకోనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి, జనవరి 9న విడుదల చేయనున్నట్టు ప్రశాంత్‌నీల్‌ ప్రకటించారు.