LOADING...
OG : ఓజీపై హైప్ పెంచేందుకు టీమ్ మాస్టర్ ప్లాన్.. లిరికల్ సాంగ్ రెడీ!
ఓజీపై హైప్ పెంచేందుకు టీమ్ మాస్టర్ ప్లాన్.. లిరికల్ సాంగ్ రెడీ!

OG : ఓజీపై హైప్ పెంచేందుకు టీమ్ మాస్టర్ ప్లాన్.. లిరికల్ సాంగ్ రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న వేళ, అభిమానుల ఉత్కంఠ పెరిగిపోతోంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రంపై హైప్‌ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ 'ఓజస్ గంభీర' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారన్న వార్త ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఆయన రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్‌గా తిరిగి వస్తాడు, రివెంజ్ కోసం మళ్లీ ఎంట్రీ ఇస్తాడు అనే కాన్సెప్ట్‌ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగిస్తోంది.

Details

ఆగస్ట్ 2న ఓజీ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ రిలీజ్

బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని టాక్‌ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఓజీ టీమ్ ప్రమోషన్స్‌ మీద ఫోకస్ పెంచింది. పవన్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, ఈ సినిమా ప్రమోషన్స్‌కు ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు సమాచారం. ఆగస్ట్ 2న ఓజీ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను, పవన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్.

Details

సినిమాపై బజ్ ను పెంచేందుకు ప్లాన్

అంతేగాక ప్రమోషన్‌ ఈవెంట్స్‌ ద్వారా సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఈ సినిమాలో పవన్ కుమారుడు అకీరానంద్ ఒక క్యామియో రోల్‌లో కనిపించనున్నాడా? అన్న విషయమై ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే ఈ అంశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఎమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ వంటి బలమైన తారాగణం ఈ సినిమాకి మరింత బలాన్నిస్తోంది. మొత్తం మీద 'ఓజీ' చిత్రం విడుదల దగ్గర పడుతున్న వేళ.. ఇది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.