తదుపరి వార్తా కథనం
Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 26, 2024
05:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' టీజర్ విడుదలైంది.
వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన టీజర్‌లో నారా రోహిత్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.
నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది.
ప్రేక్షకుల నుంచి ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో వృతి వాఘని కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా రోహిత్ చేసిన ట్వీట్
Here’s the teaser for my next #Sundarakanda!https://t.co/lwJL0ob8DK pic.twitter.com/h00dr532Wr
— Rohith Nara (@IamRohithNara) August 26, 2024