Page Loader
Teja Sajja: రామోజీ ఫిల్మ్‌సిటీలో 'మిరాయ్' యాక్షన్ ఘట్టాల సందడి
రామోజీ ఫిల్మ్‌సిటీలో 'మిరాయ్' యాక్షన్ ఘట్టాల సందడి

Teja Sajja: రామోజీ ఫిల్మ్‌సిటీలో 'మిరాయ్' యాక్షన్ ఘట్టాల సందడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దుర్మార్గం విజృంభించే సమయంలో, ధర్మానికి దారి చూపించే ఓ శక్తివంతమైన ఆయుధం జన్మిస్తుంది. యుగాల కిందట ఆవిర్భవించిన ఓ అద్భుత ఆయుధం చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న చిత్రం 'మిరాయ్' (Mirai). ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతోంది. ఈ పోరాట సన్నివేశాలను ఫైట్ మాస్టర్ నభాకాంత్‌తో పాటు రాబిన్ సుబ్బు,అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్లు కలిసి తేజ సజ్జాతో ఈ పోరాట సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు

వివరాలు 

ఎనిమిది భాషల్లో విడుదల

'మిరాయ్' చిత్రానికి దర్శకుడిగా కార్తీక్ ఘట్టమనేని పనిచేస్తున్నారు. ప్రొడక్షన్ బాధ్యతలను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ తమ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, శ్రియ, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'మిరాయ్' సినిమాను సెప్టెంబర్ 5న ఏకకాలంలో ఎనిమిది భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం భారీగా సన్నాహాలు చేస్తోంది.