
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' సెన్సేషన్.. రికార్డ్ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'మిరాయ్' ఎట్టకేలకు విడుదలైంది. రిలీజ్ అయిన తొలి షో నుంచే విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా, సాధారణ ప్రేక్షకులతో పాటు రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖుల నుంచీ కూడా ప్రశంసలు అందుకుంటోంది. మొదటి రోజే థియేటర్ల వద్ద యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా తరలి రావడంతో, చిత్రానికి బంపర్ ఓపెనింగ్ లభించింది. తాజాగా మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజే రూ.27.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
Details
తేజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే వీకెండ్ కలెక్షన్లు మరింత భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'మిరాయ్'కు అద్భుతమైన స్పందన లభించడం విశేషం. దీంతో ఫస్ట్ వీక్ ముగిసే నాటికి మంచి నంబర్స్ రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 'మిరాయ్' తేజ సజ్జా కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా బాక్సాఫీస్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఆరంభమైంది. మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లతో ఈ సినిమా భవిష్యత్తులో మరిన్ని కలెక్షన్ రికార్డులను సృష్టించే అవకాశముందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.