తెలుగు సినిమా: దసరా సందర్భంగా విడుదలవుతున్న సినిమాల రన్ టైమ్స్, ఇతర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
దసరా సందర్భంగా థియేటర్ల వద్ద చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దసరా పండక్కి థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడి పోనున్నాయి.
ఈ దసరాకి పెద్ద సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం వాటి రన్ టైమ్స్ ఇంకా ఇతర విషయాలు తెలుసుకుందాం.
భగవంత్ కేసరి:
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకున్న భగవంత్ కేసరి చిత్ర రన్ టైం 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Details
టైగర్ నాగేశ్వరరావు
మాస్ మహారాజా రవితేజ మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది.
ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర రన్ టైం 3గంటల 1నిమిషం ఉందని సమాచారం.
లియో:
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన చిత్రం లియో. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలోకి వస్తుంది.
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిడివి 2గంటల 44నిమిషాలు ఉన్నట్లు సమాచారం.
Details
గణపత్
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవుతుంది.
వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించిన గణపత్ సినిమా అక్టోబర్ 20వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా నిడివి 2గంటల 10నిమిషాలు ఉన్నట్లు సమాచారం.
ఘోస్ట్:
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఘోస్ట్ సినిమాలో కన్నడ హీరో శివరాజ్ రాజ్ కుమార్ నటించారు. సందేశ్ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను శ్రీని డైరెక్ట్ చేశారు.
అక్టోబర్ 19వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ సినిమా రన్ టైం 2గంటల 7నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది.