LOADING...
ఓటీటీ: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే? 
ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

ఓటీటీ: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 06, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం డిజిటల్ వేదికగా సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం. IB 71: తెలుగు దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విద్యుత్ జమ్వాల్ హీరోగా కనిపిస్తారు. అనుపమ్ ఖేర్, బిజయ్ ఆనంద్ నటించిన ఈ సినిమా, జులై 7నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనుంది. ఫర్హానా: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. జులై 7నుండి సోనీ లివ్ లో తెలుగు, తమిళంలో అందుబాటులో ఉండనుంది.

Details

డబ్బు కోసం పరితపించే కుర్రాడి కథ 

టక్కర్: సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా, ఈ మధ్య థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికీ డబ్బే కారణమనీ, డబ్బు సంపాదిస్తే అన్ని బాధలు తొలగిపోతాయనుకునే కుర్రాడి కథే టక్కర్. ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుండు అందుబాటులో ఉంది. స్వీట్, కారం, కాఫీ: ఒకే ఇంట్లో ఉండే మూడు తరాలకు చెందిన మహిళలు, తమ జీవితంలోని అసంతృప్తిని పోగొట్టుకోవడానికి రోడ్ ట్రిప్ వెళతారు. ఆ ట్రిప్ లో వాళ్ళేం తెలుసుకున్నారనేదే కథ. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, మదుబాల, శాంతి బాలచంద్రన ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో ఈరోజు నుండి అందుబాటులో ఉంది.