ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజైన సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం ఏదో ఒక కొత్త సినిమా థియేటర్లో సందడి చేస్తుంటుంది అలాగే ఓటీటీ లోనూ సినిమాలో రిలీజ్ అవుతుంటాయి. మరి ఈ వారం రిలీజైన సినిమాలు ఏంటో చూద్దాం.
శాకుంతలం
సమంత కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయింది ఈ సినిమా. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే కావ్యం ఆధారంగా తెరకెక్కింది.
శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు గుణశేఖర్. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్జున్ బాలనటిగా కనిపించిన ఈ సినిమా, మే 11నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
Details
రెండు ఫ్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉన్న చిత్రం
న్యూ సెన్స్
యాక్టర్ నవదీప్, హీరోయిన్ బిందు మాధవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ న్యూ సెన్స్. రాజకీయాలకు మీడియాకు మధ్య ఉండే సంబంధాన్ని ఈ సిరీస్ చూపించబోతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ రూపొందించిన ఈ సిరీస్ ను, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు మే 12 నుండి ఆహాలో అందుబాటులో ఉంది.
సీఎస్ఐ సనాతన్
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. నందిని రాయ్, అలీ రెజా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మర్డర్ మిస్టరీని ఛేధించే పాత్రలో ఆది కనిపిస్తాడు. ఈ చిత్రం ఆహాలోనూ అందుబాటులో ఉంది.