
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద ఆసక్తికరమైన వినోదం కనిపించనుంది. అన్నీ చిత్రాలే అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ కథాంశాలతో వస్తున్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం. స్పై: కార్తికేయ 2, 18పేజెస్ సినిమాలతో విజయం అందుకుని మంచి జోరు మీదున్న నిఖిల్ నుండి వస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక రహస్యాన్ని ఛేధించే కథాంశంతో ఈ సినిమా వస్తోంది. గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, జూన్ 29న రిలీజ్ అవుతుంది. మాయా పేటిక: ప్రతీ మనిషి దగ్గర ఇప్పుడొక మాయా పేటిక ఉంది. అదే సెల్ ఫోన్. దానివల్ల కలిగే విషయాలను ఇంట్రెస్టింగ్ గా చూపించడానికి జూన్ 30వ తేదీన వచ్చేస్తోంది.
Details
నవ్వించడానికి వస్తున్న సామజవరగమన
సామజవరగమన: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రం, ఆద్యంతం నవ్వు తెప్పించే కథాంశంతో తెరకెక్కింది. వివాహ భోజనంబుతో దర్శకుడిగా మారిన రామ్ అబ్బరాజు తెరకెక్కించిన రెండవ చిత్రం ఇది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా, జూన్ 29న థియేటర్లలోకి వస్తుంది. లవ్ యూ రామ్: ప్రేమంటే విపరీతంగా నమ్మే ఒకమ్మాయి, అస్సలు నమ్మక లేని ఒకబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథే లవ్ యూ రామ్. ప్రముఖ దర్శకుడు దశరథ్ కథ అందించి, నిర్మాణంలో భాగస్వామిగా మారిన ఈ సినిమాను డీవీ చౌదరి డైరెక్ట్ చేసారు.