Happy Birthday Nikhil: నిఖిల్ కేరీర్‌లో గుర్తుండిపోయే టాప్ -5 పాత్రలు ఇవే
బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వశక్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. 2007లో హ్యాపీ డేస్‌తో సినిమాతో తెరంగ్రేట్రం చేసిన నిఖిల్, ఆ తర్వాత విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న అతను, 'స్పై' పేరుతో మరో అద్భతమైన చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోగా నిఖిల్ ఇప్పటి వరకు అనేక పాత్రల్లో నటించారు. అయితే గురువారం(జూన్1) అతని పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ పోషించిన టాప్ -5 పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం
హ్యాపీ డేస్(2007) శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో నిఖిల్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో నిఖిల్‌కు మంచి పేరు వచ్చింది. అతని కామెడీ టైమింగ్ ఇందులో బాగుంటుంది. ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ఎనిమిది మంది విద్యార్థుల కథను శేఖర్ కమ్ముల అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాతో నిఖిల్‌కు మంచి పేరు వచ్చింది. స్వామి రా రా(2013) సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'స్వామి రా రా' సినిమాలో నిఖిల్ కామెడీ టైమింగ్ విమర్శకుల ప్రశంసలందుకుంది. బంగారు విగ్రహం చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమాలో నిఖిల్‌తో పాటు స్వాతి, సత్య, రవిబాబు, పూజా రామచంద్రన్, జీవా, రవివర్మ, ప్రవీణ్ నటించారు.
కార్తికేయ-2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు
కార్తికేయ(2014) చందూ మొండేటి కార్తికేయ చిత్రానికి దర్శకత్వం వహించారు. రహస్యాలను ఛేదించడానికి ఇష్టపడే కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా(2016) రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఒక ఆడ దెయ్యంలో ప్రేమలో పడిన యువకుడి పాత్రలో నిఖిల్ అద్భుతంగా నటించాడు. నిఖిల్‌తో పాటు హెబ్బా పటేల్, నందితా శ్వేత, అవికా గోర్, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో నటించారు. కార్తికేయ-2(2022) ఆధ్యాత్మిక థ్రిల్లర్ కార్తికేయకు ఇది సీక్వెల్. ఇందులో నిఖిల్ పాత్ర చాలా బరువుగా ఉంటుంది. భారతీయ ప్రాచీన వ్యవస్థ శక్తిని, కృష్ణ తత్వాన్ని అతను తెలుసుకునే క్రమంలో నిఖిల్ పూర్తి పరిపక్వతతో నటించాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్దాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.