సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు.. నిఖిల్ సక్సెస్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే!
విభిన్న కథనాలను ఎంచుకొని తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరో నిఖిల్ ఎంతో దగ్గరయ్యాడు. నిన్నటి వరకూ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమున్న నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దుమ్ములేపుతున్నాడు. ఒకనొక దశలో వరుస ప్లాప్స్ ను చవిచూసిన నిఖిల్.. స్వామిరారా నుంచి డిఫరెంట్ కథనాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఏకంగా పవర్ ఫుల్ సజ్జెక్ట్స్ ను ఎంచుకొని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతోమందికి అదర్శంగా నిలుస్తున్నాడు. హ్యాపీడేస్ సినిమాలో ఓ సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. కార్తీకేయ్ 2 సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో ఒక్కసారిగా నిఖిల్ ఫేట్ మారిపోయింది.
పాన్ ఇండియా లెవెల్లో హీరో నిఖిల్ క్రేజ్
కార్తీకేయ్, 18 పేజేస్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అతను.. త్వరలో స్పై అనే భారీ పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నిఖిల్ కెరీర్లో కార్తికేయ్2తో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన అభిషేక్ అగర్వాల్ బ్యానర్‌తో పాటు కొత్త బ్యానర్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్ వి మెగా పిక్చర్ బ్యానర్ లో నిఖిల్ హీరోగా మరో పాన్ఇండియాను ప్రకటించారు. ఒకప్పుడు సినిమాలోకి రావడానికి 25వేలు లంచం ఇచ్చిన నిఖిల్ ఇప్పుడు 100 కోట్ల పాన్ఇండియా సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ భవిష్యతులో మరిన్ని హిట్స్ సాధించాలని ఆశిద్దాం.