ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే
ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ వారం విభిన్నమైన జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అవేంటో చూద్దాం. గాండీవధారి అర్జున: వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన గాండీవధారి అర్జున చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. యాక్షన్ అంశాలు ఎక్కువగా గల ఈ సినిమాలో సెక్యూరిటీ ఆఫీసర్ గా వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. ఆగస్టు 25న సినిమా విడుదలవుతుంది. కింగ్ ఆఫ్ కోత: దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కొత్తగా కనిపిస్తున్నాడు. అభిలాష్ జోషిలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 24న రిలీజ్ అవుతుంది.
యుగాంతం కథలను గుర్తు చేయడానికి వస్తున్న కార్తికేయ
బెదురులంక 2012: భూమి అంతమైపోతుందని అనేక వార్తలు వచ్చాయి. యుగాంతం భయంతో ఒక ఊరిలో జరిగే పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. కార్తికేయ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రాన్ని క్లాక్స్ తెరకెక్కించారు. ఆగస్టు 25న థియేటర్లలోకి వస్తుంది. ఏం చేస్తున్నావ్: విజయ్ రాజ్ కుమార్, నేహా పటాని హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాకు భరత్ మిత్ర దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న థియేటర్లలోకి ఈ సినిమా వచ్చేస్తుంది. బాయ్స్ హాస్టల్: బాయ్స్ హాస్టల్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ శవాన్ని దాచడానికి బాయ్స్ అంతా ఏం చేసారనే అంశాలు ఇందులో ఉంటాయని ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమా అగస్టు 26న విడుదలవుతుంది