
L2 Empuraan: తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే ఉత్తమమైనది.. మోహన్‌లాల్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన చిత్రం 'ఎల్2: ఎంపురాన్' (L2: Empuraan). గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది.
ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు.
తెలుగు సినీ పరిశ్రమను దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీగా మోహన్‌లాల్ అభివర్ణించాడు. తెలుగు ప్రేక్షకులు నటీనటులను గౌరవించే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు.
తన 47 ఏళ్ల కెరీర్‌లో అనేకమంది తెలుగు నటులతో కలిసి పని చేసే అవకాశం లభించిందని, నాగేశ్వరరావుతో కలిసి నటించడం తన అదృష్టమన్నారు.
Details
మార్చి 27న 'ఎల్2: ఎంపురాన్' రిలీజ్
గతంలో తాను నటించిన మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ చేశారని, ఇప్పుడు మా సినిమా డైరెక్ట్‌గా తెలుగులోనే విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.
'ఎల్2: ఎంపురాన్' కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డామని మోహన్‌లాల్ చెప్పారు.
ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి దిల్ రాజు వెంటనే అంగీకరించినట్లు పృథ్వీరాజ్ తెలిపారు. "ఈ సినిమా కథ చెప్పగానే దిల్‌రాజు వెంటనే ఓకే చెప్పారని, 2019లో 'లూసిఫర్' పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయలేకపోయామన్నారు.
ఇప్పుడు రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని, ఈ ఆదరణ చూస్తుంటే మూడో భాగం కూడా దిల్‌రాజుతో తీసేలా ఉన్నానని పృథ్వీరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక 'ఎల్2: ఎంపురాన్' మార్చి 27న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.